భారీ స్థాయిలో ఏపీలోని వైసీపీ సర్కార్ ఐఏఎస్‌లను బదిలీ చేసింది ప్రభుత్వం. మొత్తం 57 మందికి స్థాన చలనం కలగగా.. సీనియర్ అధికారులతో పాటు, ఎనిమిది జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఉన్నారు. వీరిలో సీనియర్ ఐఏఎస్ ఆర్.పి.సిసోడియాను ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా నియమించారు. ఆయన గతంలో గవర్నర్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. దేవాదాయశాఖ కమిషనర్‌గా ఉన్న ఎం.హరిజవహర్‌లాల్‌ను.. కార్మికశాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. దేవాదాయశాఖ కమిషనర్‌గా ఎస్.సత్యనారాయణను నియమించింది.
సౌరభ్‌గౌర్‌ను ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమించింది ప్రభుత్వం. కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనంతరామును మైనార్టీల సంక్షేమశాఖకు బదిలీ చేసింది. జెన్‌కో ఎండీ బి.శ్రీధర్‌ను కాలుష్య నియంత్రణ మండలి సెక్రటరీగా నియమించింది ప్రభుత్వం. ఇక మున్సిపల్ శాఖ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌ను ఏపీఐఐసీ ఎండీగా నియమించింది. పురపాలకశాఖ కమిషనర్‌గా పి.కోటేశ్వరరావును నియమించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్‌ను ఐటీశాఖకు బదిలీ చేసింది. ఇంకా మరికొందర్ని కూడా బదిలీ చేశారు.
అలాగే విజయనగరం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లను బదిలీ అయ్యారు. వీరిలో కృష్ణా జిల్లా కలెక్టర్ పీ రంజిత్ బాషా బాపట్ల జిల్లా కలెక్టరుగా బదిలీ అయ్యారు. గ్రేటర్ విశాఖ కమిషనర్ రాజబాబును కృష్ణాష్ణా జిల్లాకలెక్టురుగా నియమించారు. గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ సగిలి షణ్‌మోహన్‌ను చిత్తూరు జిల్లా కలెక్టరుగా వచ్చారు. ఏపీ పరిశ్రమలశాఖ డైరెక్టర్ స్రుజనను కర్నూలు జిల్లా కలెక్టరుగా వెళ్లారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్‌ను నెల్లూరు జిల్లా కలెక్టరుగా నియమించారు.
అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మిని విజయనగరం జిల్లా కలెక్టరుగా బదిలీ చేశారు. ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబును శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరుగా నియమించారు. తిరుపతి ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ సీఈవో గౌతమిని అనంతపురం జిల్లా కలెక్టరుగా.. శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరు బసంత్ కుమార్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేశారు. విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారిని గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌గా.. కర్నూలు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావును పురపాలక, పట్టణాభివృద్ధి కమిషనర్ అండ్ డైరెక్టర్‌గా నియమించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబును ఏపీ జెన్ కో ఎండీగా, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. బాపట్ల జిల్లా కలెక్టర్ విజయను సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.
అలాగే మరికొన్ని బదిలీలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీలోని ఏపీ భవన్ ముఖ్య రెసిడెంట్ కమిషనర్ బాధ్యతల నుంచి ఆదిత్యనాధ్ దాస్ రిలీవ్..
శాప్ ఎండీగా కె. హర్షవర్దన్.
ఎస్సీ కమిషన్ సెక్రటరీగా హర్షవర్దన్‌కు అదనపు బాధ్యతలు
కార్మిక శాఖ కమిషనర్‌గా శేషగిరిబాబు
పరిశ్రమల శాఖ కమిషనర్‌గా.. మారీటైమ్ బోర్డు సీఈఓగా ప్రవీణ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు
పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్‌గా సూర్యకుమారి
తిరుపతి మున్సిపల్ కమిషనర్ బాధ్యతల నుంచి అనుపమ అంజలిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశం
తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా నారపు రెడ్డి మౌర్యకు బాధ్యతలు
కాకినాడ మున్సిపల్ కమిషనర్ గా రమేష్ కుమార్ రావిరాల
ల్యాండ్ అండ్ సర్వే సెటిల్మెంట్ అడిషనల్ డెరైక్టర్ గా గోపాల కృష్ణ ఆర్.
సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గా కల్పనా కుమారి
మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టరుగా కోటేశ్వరరావు
సీసీఎల్‌ఏ జాయింట్ సెక్రటరీగా ప్రభాకర్ రెడ్డి
జీఏడీకి రిపోర్ట్ చేయాలని క్రైస్ట్ కిషోర్ కుమార్‌కు ఆదేశం.
ఏలూరు జిల్లా జేసీగా లావణ్య వేణి
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా విజయ సునీత
పార్వతిపురం మన్యం జిల్లా జేసీగా ఏ.సిరి.
గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా వెంకట మురళి
పశ్చిమ గోదావరి జిల్లా జేసీగా ఎస్. రామసుందర్ రెడ్డి
జీవీఎంసీ కమిషనర్‌గా సాయికాంత్ వర్మ
జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా తమీమ్ అన్సారియాకు ఆదేశం
ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్‌గా వెంకటేశ్వర్.ఎస్
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఎండీగా వినోద్ కుమార్
సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ గా వీరపాండ్యన్
ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా సురేష్ కుమార్
ఆర్ధిక శాఖ డిప్యూటీ కార్యదర్శిగా అభిషిక్త్ కుమార్ కు బాధ్యతలు
ప్రకాశం జిల్లా జేసీగా చామకూర శ్రీధర్
ఉపాధి, శిక్షణ సంస్థ డైరెక్టర్‌గా బి. నవ్య.
వైఎస్సార్ జిల్లా జేసీగా గణేష్ కుమార్
ఎన్టీఆర్ జిల్లా జేసీగా సంపత్ కుమార్.
చిత్తూరు జేసీగా శ్రీనివాసులు
కర్నూలు జేసీగా వికాస్ మర్మత్
పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గా వి. అభిషేక్
పాడేరు సబ్ కలెక్టర్ గా అదనపు బాధ్యతలు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa