గుంటూరు: రాష్ట్రం లో కోవిడ్ పూర్తిగా అదుపులో ఉందని, గత రెండు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 15, 096 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే ఇందులో 267 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలిందని శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని తెలిపారు. ప్రస్తుతం వీరంతా ఇంటి వద్దే ఉంటూ వైద్య ఆరోగ్య సేవలు పొందుతున్నారని మంత్రి చెప్పారు. కరోనా పరీక్షల విషయంలో సీఎం జగన్ నిరంతరం అప్రమతం చేస్తున్నారన్నారు.