ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంకు అర్హులు అయిన రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవడానికి మరొక అవకాశం కల్పించింది. కావున రైతు భరోసా సంబంధించి ఎవరికైనా అర్హత ఉండి వారి కుటుంబ సభ్యులలో ఎవరికీ అమౌంట్ పడక కొత్తగా పొలం పాస్ బుక్ చేయించుకున్న రైతులు సంబంధిత పత్రాలు తీసుకోని రైతు భరోసా పథకంకు అప్లై చేసుకోవాలని తెలిపారు.
కావాల్సిన పత్రాలు:
1. ఆధార్ కార్డ్
2. ఒరిజినల్ 1B
3. ఫోన్ నెంబర్
4. బ్యాంక్ అకౌంట్
రైతులకు గమనిక: కొత్తగా భూమి పాస్ బుక్ పొందిన వారు, భూమికి ఆధార్ లింక్ తప్పని సరి, లేనియడల లింక్ చేపించాలి.