కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరుణాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీ పోలేరమ్మ తల్లికి కుంకుమ పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రామినేని నాగవేణి తోపాటు సభ్యుడు తిరుపతయ్య అమ్మవారి విగ్రహా ప్రతిమను ఆలయంలో భక్తుల దర్శనార్థం ఊరేగించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు గావించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa