భారత రైల్వే రంగంలో వినూత్న ఒరవడే సృష్టించిన హై స్పీడ్ ట్రైన్ వందే భారత్ శనివారం ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు అయితే గుంటూరులో హై స్పీడ్ ట్రైన్ వందే భారత్కు స్వాగతం పలికేందుకు డిఆర్ఎం ఆదేశాల మేరకు ఏర్పాట్లు విస్తృతంగా చేస్తున్నారు. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ట్రైన్ శనివారం ఉదయం 11: 45 నిమిషాలకు సికింద్రాబాద్లో బయలుదేరి గుంటూరుకు 3: 35 నిమిషాలకు మధ్యాహ్నం చేరుకునే సమయానికి వందే భారతకు స్వాగతం పలికేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆర్ పి ఎఫ్ మరియు జిఆర్పిఎఫ్ పోలీసులు భద్రత ఏర్పాట్ల చూచనలు లైవ్ రన్ విక్షించేందుకు బిగ్ స్క్రీన్ టీవీ లను ఏర్పాటు చేసారు.