మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి అక్కచెల్లెమ్మలు అందరూ అండగా నిలవాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. నేడు విజయనగరం జిల్లా, ఎస్ కోట నియోజకవర్గ కేంద్రంలో జరిగిన వైయస్ఆర్ ఆసరా మూడవ విడత వారోత్సవాల్లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ, విజయనగరం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), జిల్లా కలెక్టర్ ఏ సూర్య కుమారి, ఎస్ కోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు , శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు తదితరులు పాల్గొన్నారు.