రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నిరసన దీక్షలు చేపట్టింది. నల్ల కండువాలతో విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద ఫ్లకార్డులతో ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు, పెన్షన్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 11వ పీఆర్సీ ప్రతిపాదిత స్కేళ్లు అమలు చేయాలని, పీఆర్సీ అరియర్లు, పెండింగ్ డీఏలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.