గ్రామ, వార్డు వలంటీర్లను ఏపీ ప్రభుత్వం సత్కరించనుంది. ఎటువంటి ఫిర్యాదులకు తావులేని మొత్తం 2,33,719 మందిని సత్కరించే ఈ వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ఈ నెల 14న కొవ్వూరులో సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు వలంటీర్లను ‘సేవా వజ్ర’ పురస్కారం, రూ.30 వేలు.. మండలం, మున్సిపాలిలో మరో ఐదుగురికి సేవారత్న అవార్డుతో పాటు రూ. 20 వేలు, మిగిలిన 2.28 లక్షల వాలంటీర్లకు సేవామిత్ర పురస్కారాలు, రూ.10వేల చొప్పున అందించనున్నారు.