తైవాన్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా భారీగా యుద్ధ నౌకలను, డజన్ల కొద్దీ ఫైటర్ జెట్లను మోహరించింది. యుద్ధానికి రిహార్సల్స్‌గా దీనిని అభివర్ణించింది. శాశ్వత స్వతంత్రదేశంగా ప్రకటించుకునేందుకు ప్రయత్నిస్తున్న తైవాన్‌కు ఇలా పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. డ్రాగన్ చర్యలతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే, డ్రాగన్ చర్యలను తైవాన్ తీవ్రంగా ఖండించింది.