నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంజనేయ కాలనీకి చెందిన వెంకటలక్ష్మి (29) అనే యువతి అదృశ్యమైంది. రామాంజనేయ కాలనీలో ఉంటున్న తన సోదరి వెంకటమ్మ వద్దకు వచ్చి కొంతకాలంగా ఉంటుంది. ఈనెల 2న వెంకటలక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆమె ఆచూకీ కోసం, బంధువులు, తెలిసిన వాళ్ల ఇళ్ల వద్ద వెతికిన ఆచూకీ తెలియకపోవడంతో సోదరి వెంకటమ్మ ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.