నందలూరు మండలం లోని ఆడపూరు పంచాయతీలో నువ్వే మా నమ్మకం జగనన్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం మండల పరిషత్ అధ్యక్షులు మేడా విజయ్ భాస్కర్ రెడ్డి, సర్పంచ్ విజయభారతి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. జగన్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ స్టిక్కర్లను నివాస గృహాలకు అంటించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఉషా సుబ్బారెడ్డి, , వక్స్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ అమీర్. మండల కో ఆప్షన్ సభ్యులు మరియు జె సి ఎస్ సచివాలయాల ఇంచార్జ్ కన్వీనర్ కలీం ఖాన్ ఎంపీటీసీ తుమ్మల భావన, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.