ప్రజలందరూ సన్మార్గంలో నడవాలని అదే యేసుక్రీస్తు భోధించాడని పాస్టర్ రెవరెండ్ స్టీఫెన్రాజ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక సిఅండఐజీ మిషన్ కాంపౌండ్ చర్చిలో ఏర్పాటు చేసిన శుభ ఆదివారం సమావేశలో ఆయన మాట్లాడారు. శుభ శుక్రవారం నుంచి మూడవ రోజు తాను వస్తానని ఏసుక్రీస్తు చెప్పిన విధంగా తిరిగి వచ్చారని తెలిపారు. ప్రజా క్షేమం కోసం శిలువ అయిన కరుణామయుడు మరణాన్ని జయించి వచ్చి ప్రేమను పంచాడన్నారు. ప్రజలందరూ ఆధ్యాత్మిక చింతనతో సన్మార్గంలో నడవాలని ప్రభువు చూపిన మార్గంలో పయనిస్తే ప్రపంచం సుఖ శాంతులతో ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రోజంతా ప్రార్థనలతో గడిపారు. కార్యక్రమంలో కార్యదర్శి నాగేంద్రకుమార్, ఆదర్శకుమార్, క్రిస్టఫర్, ఆనంద్ రాజ్, విక్టర్ జాషువా, జాన్సన్, జార్జిబాబు ప్రజలు పాల్గొన్నారు.