శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం ఆర్ లోచర్ల పంచాయతీ కంచి సముద్రం గ్రామంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా గ్రామంలో ప్రతి గడప దగ్గరికి వెళ్లి ప్రతి తలుపుకి స్టిక్కర్ అతికించి 8296082960 ఈ నెంబర్ కి మిస్డ్ కాల్స్ ఇప్పిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ లోచర్ల పంచాయతీ సచివాలయ కన్వీనర్ కురుబ మంజునాథ్ , డీలర్ రామాంజనేయులు, పంచాయతీ కన్వీనర్ వి. నారాయణ, వైఎస్ఆర్సిపి నాయకులు కే. శంకర్ నారాయణ, ఈ. లక్ష్మీనారాయణ, వాలంటీర్లు, గృహసారతులు, వి. గోపాల్, వి. ముత్యాలమ్మ, పాల్గొన్నారు.