గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కచ్‌లోని భరాపర్ గ్రామంలో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపాడు. వేగంగా దూసుకొచ్చిన కారు డ్రైవర్ రోడ్డుపక్కన నిల్చొని ఉన్న వ్యక్తిని ఢీకొట్టి ఈడ్చుకెళ్లాడు. ప్రమాద ధాటికి ఆ వ్యక్తి అమాంతం గాల్లోకి ఎగిరి తలకిందులుగా తిరిగి కిందపడ్డాడు. అతడికి తీవ్ర గాయాలవ్వగా వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నమోదయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa