జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జనంతోటీ జనసేన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ రాయలసీమ కో-కన్వీ నర్ గంగారపు రాందాస్చౌదరి పేర్కొన్నా రు. కడప జిల్లా, మదనపల్లెలోని చిత్తూరు బస్టాండు సర్కి ల్లో జనంతో టీ జనసేన కార్యక్రమంలో భాగం గా ప్రజలతో కలసి టీ తాగుతూ ప్రజాసమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రాందాస్ చౌదరి మాట్లా డుతూ వైసీపీ అసమర్థ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్ని కల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని స్పష్టం చేశారు. తాతల కాలం నాటి ఆస్తులపై మీ స్టిక్కర్ల పెత్తనం ఏంటని ప్రశ్నించారు. ఇంటికి దిష్టి తీసిన విధంగా స్టిక్కర్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగాల శివరాం, అడపా సురేంద్ర, గ్రానైట్ బాబు, జగ దీష్, నగేష్, శంకర, జనార్థన, తదితరులు పాల్గొన్నారు.