నెల్లూరులో ఏఆర్ ఎస్సై, రెడ్ హ్యాండెడ్గా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళ్ళితే... నెల్లూరు నగరంలోని పోస్టల్ కాలనీలో ఏఆర్ ఎస్ఐ విధులు నిర్వహిస్తున్న వాసు..గత కొన్నేళ్లుగా మొదటి భార్య, పిల్లలకి దూరంగా ఉంటున్నాడు. వాసుతో 30 ఏళ్ల కిందట సామ్రాజ్యం అనే మహిళతో వివాహం చేసుకున్నాడు. భార్యభర్తలు ఇద్దరిదీ సొంతూరు గుంటూరు. వీరికి కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. అయితే.. 2017వ సంవత్సరం నుంచి భార్యాభర్తల మధ్య మనస్పార్ధలు ఏర్పడ్డాయి. ఇద్దరూ కొన్నేళ్ల పాటూ దూరం అయ్యారు. 2018లో తన భర్త వాసు..మౌనిక అనే మహిళతో వివాహం చేసుకున్నాడని మొదటి భార్య ఆరోపిస్తోంది. తన భర్త తనకి కావాలని భార్య డిమాండ్ చేస్తోంది. కాగా, నెల్లూరులోని ఆదివారం ఆకస్మాత్తుగా సామ్రాజ్యం వాసు ఇంటికి వెళ్లడంతో...మౌనికతో సహజీవనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో మొదటి భార్య, కుటుంబ సభ్యులు ఏఆర్ ఎస్ఐపై దాడి చేశారు. దీంతో మొదటి భార్య తన భర్త తనకు కావాలంటూ.. పోలీసులుకు ఫిర్యాదు చేసింది.