ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కమ్లాపూర్ పట్టణంలో వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న దుకాణాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు సీతాపూర్ నుంచి లక్నో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa