దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు చుక్కెదురైంది. తెలంగాణ సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై సీబీఐ విచారణ జరపాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ ఘటనపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పాల్ వేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో జరిగే అగ్నిప్రమాదాలపై సీబీఐతో విచారణ జరపమనాలా అంటూ ప్రశ్నించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa