కందుకూరు మండల కేంద్రమైన లింక్సుంధరలోని టిడిపి మండల పార్టీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం కార్యాలయంలో పూలే చిత్రపటానికి మండల టిడిపి అధ్యక్షులు వేముల గోపాలరావు పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జి విశ్వనాధపురం గ్రామ సర్పంచ్ బొల్లినేని నాగేశ్వరరావు తెలుగు యువత అధ్యక్షులు అడపా రంగయ్య టిడిపి నాయకులు గాలంకి ప్రసాదు, గొల్లపల్లి వెంకటేశ్వర్లు, బోడి సురేష్ , నారిబోయిన నారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు.