బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం యువకుడు దోనెపూడి సురేంద్ర అలియాస్ సన్నీ హత్య కేసులో కొత్తగా ఎస్సీ ఎస్టీ సెక్షన్లు కూడా చేర్చామని ఈపూరుపాలెం ఎస్సై జనార్దన్ సోమవారం చెప్పారు. గత నెల 29వ తేదీ రాత్రి దారుణ హత్యకు గురై ఒకటో తేదీన కుందేరు కాలువలో మృతదేహం తేలిన దళిత యువకుడు సన్నీ మర్డర్ కు సంబంధించి ఆ రోజున హత్య కేసు నమోదు చేశామన్నారు అయితే ఈ హత్యలో ఇద్దరు దళితేతరులు కూడా పాల్గొన్నట్లు దర్యాప్తులో తేలడంతో ఆ ఇద్దరినీ అరెస్టు చేయడంతో పాటు సన్నీహత్య కేసులో ఎస్సీ ఎస్టీ సెక్షన్లు చేర్చామన్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని, మరి ఎవరికైనా హత్య తో సంబంధం ఉందని తేలితే వారందరినీ కూడా అరెస్టు చేస్తామని ఎస్సై జనార్థన్ చెప్పారు.