విభిన్న ప్రతిభావంతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని పురపాలక ఇన్‌ఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డి, పురపాలక చైర్మన్ డాక్టర్ వరప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం పులివెందుల పట్టణంలో చిన్నరూముల రోడ్డులో ఉన్న భవిత కేంద్రంలో సమగ్ర శిక్ష, సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో నడవలేని విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులకు ట్రై సైకిల్స్, వీల్ చైర్లు, సిపి చైర్లు, రోలేటర్లు అందజేశారు. ముఖ్యఅతిథులుగా వారు హాజరయ్యారు. కార్యక్రమంలో గంగాధర్‌రెడ్డి, విభిన్నప్రతిభావంతుల నెట్వర్క్ అధ్యక్షులు రఘునాథరెడ్డి పాల్గొన్నారు.