నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఉలికుంటపల్లి విడిది కేంద్రం నుండి 67వ రోజు పాదయాత్ర ను యువనేత ప్రారంభించారు. నేటితో శింగనమల నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి అయ్యింది. తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించిన యువగళం పాదయాత్ర ప్రవేశించింది. ఈ క్రమంలో లోకేష్ కు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తాడిపత్రికి చేరుకుని లోకేష్‌కు పూలమాలతో స్వాగతం పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa