ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమాధానం చెప్పలేకే అనర్హత వేటు: తులసిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 12, 2023, 10:33 AM

బిజెపి ప్రభుత్వ వైఫల్యాలు, మోడీ చదువు, అదానీ వ్యవహారాలపై పార్లమెంటులో రాహుల్‌గాంధీ ప్రశ్నించడాన్ని ఓర్చుకోలేని ప్రధాని మోడీ. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయించారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఎన్‌. తులసిరెడ్డి అన్నారు. స్థానిక కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా విస్తృత సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశానికి జిల్లా అద్యక్షులు అలెగ్జాండర్‌ సుధాకర్‌ అధ్యక్షత వహించగా తులసిరెడ్డి మాట్లాడుతూ వైఫల్యాలను ఒప్పుకోకుండా, ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడం మోడీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. దీనిపై రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు నోరు మెదపక పోవడం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనన్నారు. ఆ పార్టీల వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదని, వారిని రాష్ట్రం నుండి తరిమికొట్టాలని అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్‌తోనే సాధ్యమని చెప్పారు. సమావేశంలో నాయకులు రాధాకృష్ణ, బాషా, సందీప్‌, ప్రసాద్‌, గోపి, నాగేంద్ర, అనిల్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com