సీఎం జగన్ మార్కాపురం పర్యటనలో మాజీ మంత్రి, వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది అనే చెప్పుకోవచ్చు. సభాస్థలిలో బాలినేనికి ప్రొటోకాల్‌లో అధికారులు ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తీరుపై మండిపడ్డ బాలినేని... సీఎం సమక్షంలో జరుగనున్న ‘‘ఈబీసీ నేస్తం’’ కార్యక్రమంలో పాల్గొనకుండానే బాలినేనితో పాటు ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, బాలినేని అనుచరులు ఆ ప్రాంతం నుంచి ఒంగోలు వెనుదిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం.