వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల క్షేత్రం నాలుగురోజులుగా భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం ఉదయం మొదలైన యాత్రికుల రద్దీ సోమవారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. శుక్రవారం 71,782 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, రూ.3.28 కోట్ల హుండీ ఆదాయం లభించింది. శనివారం రూ.4.21 కోట్ల హుండీ ఆదాయం సమకూరగా 85,450 మంది దర్శించుకున్నారు. ఆదివారం రూ.4.86 కోట్ల హుండీ ఆదాయం రాగా, 86,129 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం 69,781 మంది శ్రీవారిని దర్శించుకోగా, రూ.5.16 కోట్ల హుండీ ఆదాయం లభించింది. ఈ నాలుగు రోజుల్లో 1.36 లక్షలమంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.