మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ క్రైమ్ థ్రిల్లర్‌ను మించిపోయిందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... వివేకాను సునీల్ యాదవ్ చంపాడన్న భాస్కర్ రెడ్డి వాదనపై ముఖ్యమంత్రి నోరువిప్పరా అని ప్రశ్నించారు. వివేకాను చంద్రబాబే చంపించాడని, నారాసుర రక్తచరిత్ర పేరుతో సాక్షి మీడియాలో విషప్రచారం చేయించిన జగన్ ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు. వివేకా హత్యకేసు దోషుల్ని శిక్షించకుండా వాళ్లు చంపారని, వీళ్లు చంపారని దుష్ప్రచారం చేస్తూ జగన్ ఎన్నాళ్లు పబ్బం గడుపుకుంటారని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు.