ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బీసీ కులాల గణన చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం త్వరలో మంత్రి వేణుగోపాలకృష్ణ నేతృత్వంలో కమిటీ వేయనున్నారు. ఈ కమిటీ నివేదికను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్రంలో బీసీ కులాల గణనకు మార్గదర్శకాలను రూపొందిస్తుంది. ఇప్పటికే బీసీ కులాల గణన చేపట్టిన బీహార్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.