గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా వైరస్ కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే వైద్య నిపుణులు శుభవార్త చెప్పారు. కొత్త కేసులు పెరుగుతున్నా.. వైరస్ ఉద్ధృతి తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా.. దేశంలో కోవిడ్ ఎండెమిక్ దశకు చేరుకుందని గుడ్ న్యూస్ చెప్పారు. మరో రెండు వారాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని స్పష్టం చేశారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.