గుంటూరు: నమ్మకంగా ఉంటున్నారని ఇంటి తాళాలు ఇచ్చి వెళ్తే దొంగతనం చేశారని దేవాపురానికి చెందిన మోటు మర్రి నాగపావని గాయత్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్యాభర్తల పై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదయింది. బాధితురాలు మార్చి1 న బయటకు వెళ్తూ తాళాలు పక్కనే ఉంటున్న రామ సైదారావు దంపతులకు ఇచ్చారు. ఆమె తిరిగి వచ్చేసరికి 2 సవర్ల బంగారు ఆభరణాలు, చెక్కు పుస్తకాలు మాయమయ్యాయని అడిగితే దుర్భాషలాడారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.