సత్తెనపల్లి: ప్రభుత్వాసుపత్రిలోని మరుగుదొడ్డిలో పాడు పనిచేస్తూ ఓ వ్యక్తి పట్టుబడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఆస్పత్రి పర్యవేక్షకుడి కార్యాలయం సమీపంలోని మరుగుదొడ్డిని శుభ్రం చేసేందుకు స్వీపర్ వెళ్లారు. లోపల గడియ పెట్టి ఉండడంతో గడియ తీయాలని గట్టిగా చెప్పడంతో అందులో నుంచి ఓ యువతి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఓ వ్యక్తి బయటకు వచ్చి పారిపోయేందుకు ప్రయత్నించగా సిబ్బంది అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.