ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. షాజహాన్పూర్ లోని ఓ ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో మేనేజర్ గా పనిచేసే శివం జోహ్రి అనే వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దొంగతనం చేశాడనే ఆరోపణలతో మేనేజర్ ను స్తంభానికి కట్టేసి కర్రలతో చితకబాదడంతో మృతిచెందాడు. దీంతో అతని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి బయట విసిరేసి దుండగులు పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.