నందమూరి తారకరామారావు స్వగ్రామం నిమ్మకూరులో నారా చంద్రబాబు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం ఆనందంగా ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మహనీయుడు ఎన్టీఆర్ పుట్టిన గడ్డ.. నిమ్మకూరని తెలిపారు . రాముడు, కృష్ణుడు, నాయకుడు ఎలా ఉండాలో ఎన్టీఆర్ చూపించారన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఢిల్లీ గడ్డనే గడగడలాడించారని, స్థానిక సంస్థలలో మొట్టమొదటిగా బీసీ, దళితుల కోసం రిజర్వేషన్‌లు కల్పించారని కొనియాడారు. హరికృష్ణ, బాలకృష్ణ తరచూ ఈ గ్రామానికి వస్తుండే వారని... ఇప్పుడు చంద్రబాబు రాకతో పల్లెలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. దుష్ట పాలనకు చరమగీతం పాడి సాగనంపాలని పిలుపిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa