ఏపీలో వైసీపీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీసీఎల్ఏ కి లేఖ రాశారు. ఏపీ లో వైసీపీ నేతలు భూములు ఆక్రమించి రియల్ ఎస్టేట్ పేరుతో అమ్మేస్తున్నారని ఫిర్యాదు చేశారు. యువగళం పాదయాత్రలో అనేక ఫిర్యాదులు తన దృష్టికి వస్తున్నాయన్నారు. హంద్రీనది ఒడ్డున కూడా భూములు ఆక్రమించారని.. దీంతో వరద నీరు నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయని తెలిపారు. ఆలయ భూములు కూడా కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. రెవిన్యూ అధికారులు, వైసీపీ నేతలు నెట్వర్క్గా ఏర్పడి అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. భూ కబ్జాలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సీసీఏఎల్ ఏకు లేఖతో పాటు లోకేష్ ఆధారాలు సమర్పించారు.