నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా, గుడివాడలో చంద్రబాబు మాట్లాడుతూ... ముద్దులు పెట్టిన జగన్ ఇప్పుడు అందర్నీ పిడిగుద్దులు గుద్దినట్టే.. ఎస్సీలను గుద్దుతున్నారన్నారు. దళిత కుటుంబాల్లో ఒకరికే అమ్మ ఒడి ఇస్తున్నారని, అన్ని కులాలకంటే ఎక్కువ పేదరికం ఎస్సీల్లోనే ఉందన్నారు. ఎస్సీలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని తాను పథకం పెడితే.. దాన్ని జగన్ నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ధరలు పెంచి ఎస్సీలపై భారం మోపారన్నారు. చరిత్రలో దళితులపై ఎప్పుడూ జరగనన్ని దాడులు ఇప్పుడే జరుగుతున్నాయన్నారు.