రైలు ప్రయాణికులకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుభవార్త చెప్పారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల తరహాలోనే వందే మెట్రో రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబరు నాటికే వందే మెట్రో నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పెద్ద నగరాల నుంచి 100 కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాలకు ఇవి రాకపోకలు సాగిస్తాయి. సౌకర్యవంతంగా ఉండటంతో పాటు అందరికీ అందుబాటు ధరల్లోనే ఉంటాయన్నారు.