కుప్పం మండలం వానగుట్టపల్లి గ్రామపంచాయతీ జంపనూరు గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్సీ భరత్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు కలిగిన లబ్ధి గురించి వివరిస్తూ వారి సమస్యలను వింటూ వాటి పరిష్కారానికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మురుగేష్, ప్రజా ప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.