పెద్దకడబూరు గ్రామంలోని సచివాలయం - 1 పరిధిలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం వైసీపీ నాయకులు జగనన్నే మా భవిష్యత్తు - మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వైసీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, రఘురామ్, శివరామిరెడ్డి, ముక్కరన్న, అర్లప్ప ప్రతి ఇంటికి వెళ్లి గత టీడీపీ ప్రభుత్వానికి, ఇప్పటి వైసీపీ ప్రభుత్వానికి పాలనలో వ్యత్యాసాన్ని అడిగి తెలుసుకున్నారు. జగనన్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొంది ఉంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ ను దీవించాలని కోరారు. అనంతరం మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్ ను అతికించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గృహసారథులు పాల్గొన్నారు.