ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 15, 2023, 01:50 PM

పెద్దకడబూరు: గర్భిణులు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని ఏఎన్ఎంలు సునీత, నాగలక్ష్మి సూచించారు. శనివారం పెద్దకడబూరు మండల పరిధిలోని బసలదొడ్డి గ్రామ సచివాలయంలో జరిగిన సమావేశంలో గ్రామ సర్పంచ్ బుడ్డ అంజినమ్మ, వైసీపీ నాయకులు శివరాం కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణులు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. అలాగే నెలసరి టీకాలను వేయించుకోవాలని, తద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్ రాజేశ్వరి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com