శ్రీకాకుళం జిల్లాలో గ్రామ రెవెన్యూ సహయకులు(వీఆర్ఏ) నిరసన ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ముఖ హాజరు నుంచి మినహాంచాలని డిమాండ్చేశారు. అనంతరం వీఆర్ఏల సమస్యలపై అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అలానే నెలిమర్లలో స్థానిక రామతీర్థం జంక్షన్లోగల అంబేడ్కర్ విగ్రహానికి తమ సమస్యలు పరి ష్కరించాలని మండలంలోని పలువురు వీఆర్ఏలు శుక్ర వారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు నేతల సూరిబాబు, ఎల్.సన్యాసిరావు, బి.కృష్ణ, టి.రమేష్ పాల్గొన్నారు.