తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం 71 వ రోజు పాదయాత్రలో. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథి రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు బాలస్వామిరెడ్డి, ఉపాధ్యక్షుడు జగన్నాథ రెడ్డి, సీనియర్ నాయకులు ఎద్దుల కొండ్రాయుడు, పూల అల్లాబకష్, కృష్ణారెడ్డి, పివి రమణ, నాగభూషణం, మహబూబ్ షరీఫ్, గోపాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రామ సుబ్బారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, శేఖర్, శ్రీనివాసులు, శేషగిరి, కాటా రామయ్య, శివయ్య తదితరులు పాల్గొన్నారు. శనివారం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని పొలిమేర మెట్ట క్యాంప్ సైట్ నుండి యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా నారా లోకేష్ కు గజమాల వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం రాబోయేది తెలుగు దేశం ప్రభుత్వమేనని, ప్రజలు టిడిపి ని పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని నారా లోకేష్ ను వారు వివరించారు. రాష్ట్ర యువత తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని, వైకాపా పాలన పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ పాదయాత్ర విజయవంతంగా పూర్తి కావాలని కోరారు.