ఆఫ్రికా దేశంలోని సుడాన్లో ఆర్మీ, పారామిలటరీ దళాల మధ్య ఘర్షణ జరుగుతోంది. రాజధాని ఖార్టూమ్‌లో శనివారం ఇరు వైపులా భారీగా కాల్పులు, పేలుళ్లు జరిగాయి. ఈ నేపథ్యంలో సుడాన్‌లోని భారతీయులు బయటకు రావొద్దని, ఇళ్లలోనే ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఖార్టూమ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం సూచించింది. భారతీయులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని, తాజా అప్డేట్స్ కోసం వేచి ఉండాలంటూ ట్వీట్ చేసింది.