మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని ఈ కేసులో నిందితుడిగా చేర్చింది. ఆదివారం రోజు సీబీఐ అరెస్ట్ చేసిన వైఎస్. భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కూడా అవినాశ్ ను సహ నిందితుడిగా పేర్కొంది. కాగా, నేడు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన హైదరాబాద్ బయలుదేరారు.