నెల్లూరు నగరంలో ఎన్నో పనులు పెండింగ్ లో ఉన్నాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ హయాంలో చంద్రబాబు, వెంకయ్యనాయుడు, పొంగురు నారాయణ ప్రోత్సాహంతో పనులు ప్రారంభం అయ్యాయన్నారు. దీనికి రూ.17.55 లక్షల నిధులు కేంద్ర అమృత్ పథకం కింద మంజూరు చేయించారని, ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయని అన్నారు. 15 రోజుల్లో పనులు ప్రారంభం కాకుంటే, నుడా కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. దర్గా అభివృద్ధికి నిధులు మంజూరు కావడం ముస్లిం విజయం అని చెప్పానని.. అది అధికార పార్టీకి నచ్చినట్టు లేదన్నారు. తన మూడేళ్ల పోరాటం తరువాత ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.