ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఘటనకు కారణం సైనికుడే...పంజాబ్ పోలీసులు వెల్లడి

national |  Suryaa Desk  | Published : Mon, Apr 17, 2023, 08:37 PM

బఠిండా ఆర్మీ స్టేషన్ లో జరిగిన కాల్పుల ఘటనలో సైనికులపై తోటి సైనికుడే ఈ కాల్పులకు తెగబడ్డాడని, వ్యక్తిగత కక్షతోనే నలుగురిని చంపేశాడని పంజాబ్ పోలీసులు వెల్లడించారు. ముసుగు వ్యక్తుల పనేనంటూ విచారణను తప్పుదోవ పట్టించేందుకు హంతకుడు ప్రయత్నించాడని తెలిపారు. మరింత లోతుగా విచారించడంతో అసలు విషయం బయటపెట్టాడని చెప్పారు.


దీంతో హంతకుడిని సోమవారం అరెస్టు చేశామని బఠిండా ఎస్పీ గుల్నీత్ సింగ్ ఖురానా మీడియాకు వివరించారు. దేశంలోనే అతిపెద్ద, కీలకమైన మిలటరీ స్థావరం బఠిండాలో ఈ నెల 12న కాల్పుల కలకలం చోటుచేసుకుంది. తమ టెంట్ లో నిద్రిస్తున్న నలుగురు జవాన్లపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో నలుగురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.


ప్రాథమిక విచారణలో ఇద్దరు ముసుగు వ్యక్తులు ఆ టెంట్ నుంచి బయటకు రావడం చూశానని మోహన్ దేశాయ్ అనే జవాను వెల్లడించాడు. దీనిపై పంజాబ్ పోలీసులు మరింత లోతుగా విచారించారు. అనుమానితులు నలుగురు జవాన్లతో పాటు దేశాయ్ ను కూడా ప్రశ్నించారు. దీంతో ఆ నలుగురు జవాన్లను చంపింది తానేనని దేశాయ్ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. దీంతో దేశాయ్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com