సూడాన్‌లో ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ హింసాత్మక ఘటనల్లో సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు దాదాపు 200 మంది చనిపోయారు. 1800 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాకెట్లు అక్కడి ఇళ్లలోకి చొచ్చుకెళ్తున్నాయి, బుల్లెట్లు తాకి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆస్పత్రులు సైతం ధ్వంసం అవటంతో వైద్య సదుపాయాలు లేక, తినడానికి తిండి లేక అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు.