పసుపుతో ఇంటి వాస్తు దోషాలు తొలగించుకోవచ్చని పండితులు పేర్కొంటున్నారు. పూజలో ఉపయోగించే పసుపును నీళ్లలో వేసి ఇంట్లో చల్లుకోవాలి. ప్రధాన ద్వారానికి ఇరువైపులా పసుపుతో స్వస్తిక్ చిహ్నం వేస్తే ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. జాతకంలో కుజుడు అశుభంగా ఉన్నప్పుడు పసుపు రంగు వస్తువులు దానం చెయ్యాలి. ఇంట్లో డబ్బు ఉంచే చోట పసుపు ముద్దను ఉంచాలి. కుబేర యంత్రాన్ని ఖజానాలో ఉంచినా ఆర్థిక వృద్ధి కలుగుతుందంటున్నారు.