ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న ఇళ్ల నిర్మాణం పురోగతిపై అధికారులతో మంత్రి జోగి రమేష్ సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 18, 2023, 03:09 PM

ఏలూరు రూరల్ పోణంగి జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలను మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే ఆళ్ల నాని పరిశీలించారు. ఏలూరు కలెక్టరేట్‌లో జగనన్న ఇళ్ల నిర్మాణం పురోగతిపై అధికారులతో మంత్రి జోగి రమేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. జగనన్న కాలనీల్లో అన్ని ఇళ్లను పూర్తి చేస్తామన్నారు. ప్రతి పేద అక్క చెల్లెమ్మలకు ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇవ్వడమే జగనన్న లక్ష్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22లక్షల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కావాలనే జగనన్న కాలనీలపై విమర్శలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదుని జోగి రమేష్ విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com