గుంటూరు జిల్లా కలెక్టరేట్లో గృహ నిర్మాణ పథకంపై మంత్రి జోగి రమేష్ బుధవారం సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో ఇళ్ల నిర్మాణాల్లో సమస్యలపై సమీక్షించామన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. వారికి శాశ్వితంగా ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణాలతో పాటు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. అన్ని పనులు త్వరగతిన పూర్తి చేస్తామన్నారు.