ముప్పాళ్ళ మండలం మాదల గ్రామం సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మాదల లో జరిగిన తిరునాళ్ల చూసి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పాదచారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో బైక్ పై ముగ్గురు ఉండగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa