రోజురోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నివాస్ సూచించారు. గుంటూరు సర్వజన ఆస్పత్రిలో సూపరింటెండెంట్ ప్రభావతి తో బుధవారం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ కేసులు పెరుగుతున్నందున నేపథ్యంలో ఔషధాలు నిల్వలు ఉంచుకోవాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.